Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:30 AM
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
రంగారెడ్డి, జనవరి 19: జిల్లాలోని ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ.. యాక్టీవాపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంతో ఆరాంఘర్ చౌరస్తాలో కాసేపు ట్రాఫిక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? అనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..
Read Latest Telangana News And Telugu News