Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:00 AM
స్పెయిన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన ఓ రైలును ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. 73 మంది గాయాలపాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం చెందారు. మరో 73 మంది గాయాల పాలయ్యారు. దక్షిణ స్పెయిన్‌లోని అడమూజ్ టౌన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది (Spain Train Accident).
మాలగా నుంచి మ్యాడ్రిడ్‌కు వెళుతున్న ఓ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై వెళుతున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు తెలిపారు. మొదట పట్టాలు తప్పిన రైలులో 300 మంది, రెండో రైల్లో 100 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదం నేపథ్యంలో సోమవారం మ్యాడ్రిడ్- మాలగా మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశామని అధికారులు చెప్పారు.
ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదో అసాధారణ ప్రమాదమని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయెంతే తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.
ఇవీ చదవండి:
ట్రంప్ మమల్ని నట్టేట ముంచేశారు.. ఇరాన్‌లో జనాగ్రహం
75 దేశాలకు వీసా ప్రక్రియను నిలిపివేసిన అమెరికా