Share News

Peter Navarro: భారత్‌లో ఏఐ కోసం..అమెరికన్లు ఎందుకు డబ్బు కట్టాలి?

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:02 AM

భారత్‌పై తరుచూ విషం చిమ్మే అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. చాట్‌ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లను అమెరికన్ల డబ్బు..

Peter Navarro: భారత్‌లో ఏఐ కోసం..అమెరికన్లు ఎందుకు డబ్బు కట్టాలి?

  • మరోసారి విషం కక్కిన పీటర్‌ నవారో

వాషింగ్టన్‌, జనవరి 18: భారత్‌పై తరుచూ విషం చిమ్మే అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. చాట్‌ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లను అమెరికన్ల డబ్బు, వనరులతో అభివృద్ధి చేస్తుండగా.. అవి భారత్‌, చైనా వంటి దేశాలకు సేవలందిస్తున్నాయన్నారు. ‘‘భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బు చెల్లించాలి’’ అని ప్రశ్నించారు. వైట్‌హౌస్‌ మాజీ ప్రధాన వ్యూహకర్త స్టీవ్‌బానన్‌తో కలిసి ‘రియల్‌ అమెరికా వాయిస్‌’ అనే కార్యక్రమంలో నవారో మాట్లాడారు. ‘‘చాట్‌ జీపీటీ అమెరికా గడ్డపై నుంచి నడుస్తోంది. అమెరికా విద్యుత్‌ను వాడుకుంటోంది. కానీ భారత్‌, చైనా సహా అనేక దేశాలకు సేవ చేస్తోంది’’ అని అన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 04:02 AM