India-Pakistan Border: భారత్-పాక్ సరిహద్దులో మారణాయుధాలు లభ్యం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:16 AM
పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
పఠాన్‌కోట్, జనవరి 18: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలోని నరోత్ జైమల్ సింగ్ ప్రాంతంలో పఠాన్‌కోట్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మారణాయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు మూడు ఏకే-47 రైఫిళ్లు, ఐదు మ్యాగజీన్లు, టర్కీ, చైనా దేశాలలో తయారైన రెండు పిస్టళ్లు, వాటికి సంబంధించిన రెండు మ్యాగజీన్లు, 98 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.