Hindu Businessman Assault: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:03 AM
అరటి గెలలు చోరీ చేశారనే అనుమానంతో బంగ్లాదేశ్‌లో ఓ హిందూ వ్యాపారిని హత్య చేశారు. ఆ దేశంలోని గాజీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఢాకా, జనవరి 18: అరటి గెలలు చోరీ చేశారనే అనుమానంతో బంగ్లాదేశ్‌లో ఓ హిందూ వ్యాపారిని హత్య చేశారు. ఆ దేశంలోని గాజీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాలీగంజ్‌లో హోటల్ యజమాని అయిన లిటన్ చంద్ర ఘోష్(55)పై స్వపన్ మియా(55), అతని భార్య మజేదా ఖాతూన్(45), వారి కుమారుడు మాసుమ్ మియా(28) దాడి చేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మాసుమ్‌కున్న అరటి తోటలోని కొన్ని అరటి గెలలు కనిపించకుండా పోయాయి. వాటిని లిటన్ హోటల్‌లో గుర్తించిన అతడు హోటల్ సిబ్బందితో వాదనకు దిగాడు. అనంతరం తన తండ్రి, తల్లితో పాటు వచ్చి లిటన్‌పై దాడి చేసి కొట్టడంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బంగ్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.