Share News

EU Slams Trumps Greenland Tariffs: గ్రీన్‌లాండ్‌ సుంకాలపై ఈయూ ఫైర్‌!

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:07 AM

ట్రంప్‌ ‘గ్రీన్‌లాండ్‌ టారిఫ్‌’పై యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మండిపడింది. ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయం యూరోపియన్‌ దేశాల ప్రయోజనాలకు భంగకరమని పేర్కొంది.

EU Slams Trumps Greenland Tariffs: గ్రీన్‌లాండ్‌ సుంకాలపై ఈయూ ఫైర్‌!

  • అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం నిలిపివేతకు ఈయూ పార్లమెంటు నిర్ణయం

  • ఈయూ ప్రతినిధుల అత్యవసర భేటీ

  • గ్రీన్‌లాండ్‌పై తమ వైఖరి మారదంటూ ఏడు దేశాల సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 18: ట్రంప్‌ ‘గ్రీన్‌లాండ్‌ టారిఫ్‌’పై యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మండిపడింది. ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయం యూరోపియన్‌ దేశాల ప్రయోజనాలకు భంగకరమని పేర్కొంది. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు యూరోపియన్‌ పార్లమెంటు ప్రకటించింది. ఇక ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ టారి్‌ఫలు విధించిన 8యూరప్‌ దేశాలు ఆదివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ట్రంప్‌ బెదిరింపులు విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. గ్రీన్‌లాండ్‌ విషయంలో తమ వైఖరి మారదని, డెన్మార్క్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తెచ్చుకునే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, నెదర్లాండ్స్‌ దేశాలపై 10ు అదనపు సుంకాలను ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌ నుంచి ఈ అదనపు సుంకాలను 25శాతానికి పెంచుతామని.. గ్రీన్‌లాండ్‌ అమెరికా ఆధీనంలోకి వచ్చే వరకు సుంకాలు కొనసాగిస్తామని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు యూరోపియన్‌ పార్లమెంటు ప్రకటించింది. నిజానికి గత ఏడాది జూలైలోనే ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం.. అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే యూరోపియన్‌ వస్తువులపై 15శాతం సుంకాలు వసూలు చేస్తుంది. ఈయూ దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు(జీరో టారిఫ్‌) విధించవు. దీనిని యూరోపియన్‌ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. వచ్చే వారంలోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలపాల్సి ఉందని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని నిలిపివేసినట్టేనని స్వీడన్‌కు చెందిన ఈయూ పార్లమెంటు సభ్యురాలు కరిన్‌ కార్ల్స్‌బ్రో తెలిపారు. ప్రస్తుతం ట్రంప్‌ ప్రకటించిన గ్రీన్‌లాండ్‌ టారి్‌ఫతో ఈయూ దేశాలపై సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి 25శాతానికి, జూన్‌ తర్వాత 40శాతానికి పెరుగుతాయి. ఇదిలా ఉండగా, ట్రంప్‌ ఆరోపించినట్టుగా గ్రీన్‌లాండ్‌కు తమ బలగాలను పంపినది అమెరికాను రెచ్చగొట్టేందుకు కాదని.. గ్రీన్‌లాండ్‌పై రష్యా, చైనా కన్నేశాయన్న ట్రంప్‌ హెచ్చరికలను అనుగుణంగానే పంపామని డెన్మార్క్‌ విదేశాంగ మంత్రి లార్స్‌ రాస్ముస్సేన్‌ వెల్లడించారు. ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ టారిఫ్‌ యూరోపియన్‌ దేశాల ప్రయోజనాలకు భంగకరమని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు.


విపరీత పరిణామాలు!

గ్రీన్‌లాండ్‌ కోసం ట్రంప్‌ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపులు విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని యూకే, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, నార్వే, స్వీడన్‌ ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘‘డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ ప్రజల తరఫున నిలబడతాం. ఈ విషయంలో మా వైఖరిలో మార్పులేదు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. నాటో సభ్యులుగా ట్రాన్స్‌ అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నాయి. కాగా, ట్రంప్‌ టారి్‌ఫలు విధించిన దేశాల్లో ఒకటైన జర్మనీ ఈ ప్రకటనలో భాగం కాలేదు. అంతేకాదు గ్రీన్‌లాండ్‌కు పంపిన తమ 15 మంది సైనిక బృందాన్ని కూడా వెనక్కి పిలిచింది.

చైనా, రష్యా నవ్వుకుంటున్నాయి!

నాటో దేశాలపై ట్రంప్‌ టారి్‌ఫలను చూసి చైనా, రష్యా నవ్వుకుంటున్నాయని.. నాటో మిత్రదేశాల మధ్య విభేదాలతో లాభపడేది ఆ దేశాలేనని ఈయూ విదేశాంగ విభాగం చీఫ్‌ కాజా కల్లాస్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘ఒకవేళ గ్రీన్‌లాండ్‌ భద్రతకు ఏదైనా ప్రమాదం ఉంటే.. దాన్ని నాటోలో అంతర్గతంగానే చర్చించుకుని, పరిష్కరించుకోవాలి. టారి్‌ఫలు అటు యూర్‌పకు, ఇటు అమెరికాకూ నష్టకరమే’’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే ఆమె అన్నట్టుగానే.. యూరప్‌ దేశాలను, గ్రీన్‌లాండ్‌ టారి్‌ఫలను ఎగతాళి చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యేక రాయబారి కిరిల్‌ డిమిత్రివ్‌.. ‘మీ నాన్నను రెచ్చగొట్టకండి’ అని ట్రంప్‌, ఈయూ నేతలను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. ఎనిమిది దేశాల నుంచి పది, పదిహేను మంది చొప్పున సైనికులను గ్రీన్‌ల్యాండ్‌కు పంపడం, దానిపై ట్రంప్‌ మండిపడి టారి్‌ఫలు విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఒక్కో సైనికుడికి ఒక శాతం టారిఫ్‌ అన్నమాట’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - Jan 19 , 2026 | 05:47 AM