Visa Suspension: 75 దేశాలకు వీసా ప్రక్రియను నిలిపివేసిన అమెరికా
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:05 AM
అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
న్యూఢిల్లీ, జనవరి 14: అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 75 దేశాల పౌరులకు వీసా జారీ ప్రక్రియను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ జాబితాలో సోమాలియా, రష్యా, అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్, యెమెన్, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి ఆయా దేశాల పౌరులకు వీసాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, వీసా స్ర్కీనింగ్, వెట్టింగ్ విధానాలపై సమగ్ర పునఃసమీక్ష చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉన్న వారిని దేశంలోకి అనుమతించకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ నిలిపివేతలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.