సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:09 AM
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
శ్రీ సత్యసాయి జిల్లా , ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Sathya Sai District Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మందికి గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..
ప్రమాదానికి కారణమిదే..
శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు క్షేమంగా కిందకు దింపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. హైవేలపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మూల మలుపులు, జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Read Latest Telangana News And AP News And Telugu News