Share News

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..

ABN , Publish Date - Feb 08 , 2026 | 09:12 AM

చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..
Elephants

చిత్తూరు జిల్లా, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఏనుగులు (Elephants) గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు.. ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు అడవి మార్గం తప్పిపోయాయో.. లేక ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయో తెలీదు కానీ, రెండు ఏనుగులు నగరం మధ్యలోకి రావడంతో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.


సంతపేటలో ఏనుగుల సంచారం..

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సంతపేట ప్రాంతంలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయి. తెల్లవారుజామున వీధుల్లో ఏనుగులను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా పంట పొలాల్లో కనిపించే ఏనుగులు.. జనసంచారం అధికంగా ఉండే నగర వీధుల్లోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. భయంతో పరుగుపరుగున ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కేశారు.


రంగంలోకి అటవీ శాఖ..

ఏనుగుల రాకపై సమాచారం అందుకున్న అటవీ శాఖ (Forest Department) అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వాటిని తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏనుగులకు ఎదురు వెళ్లొద్దని, సెల్ఫీలు లేదా ఫొటోల కోసం వాటిని ఇబ్బంది పెట్టొద్దని స్థానికులను హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 08 , 2026 | 09:54 AM