Share News

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:39 AM

హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణమే నెలకొంది. అయితే సోమవారం నాటికి ఏపీలో వాతావరణం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..
Telugu States Weather

హైదరాబాద్‌, అమరావతి , ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. వర్ష సూచనలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో..

తెలంగాణలో వాతావరణం శనివారం సాధారణంగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు ఎలాంటి వర్ష సూచనలూ లేవని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగనున్నాయని వివరించారు.


ప్రతి ఏడాదీ డిసెంబర్, జనవరిలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శనివారం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బయట ఎక్కువసేపు తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వాతావరణం పొడిగా, పూర్తిగా ఎండతో ఉంటుందని వివరించారు.


ఏపీలో పొడి వాతావరణం..

ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులూ (శని, ఆదివారాలు) పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఒకటి, రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం (ఫిబ్రవరి9) వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు వివరించారు.


ఈ రోజు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎల్లుండి (సోమవారం) దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చలి తీవ్రతలో ఎలాంటి మార్పులూ ఉండవని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోమవారం తేలికపాటి వర్ష సూచన ఉన్నందున, కోత దశలో ఉన్న పంటల విషయంలో అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 07:39 AM