Home » IMD
ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్, అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రజలు జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
రాష్ట్రాన్ని భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తోన్న తీవ్ర వాయుగుండం తీరం దాటింది. నిన్న రాత్రి(బుధవారం) కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.
ఏపీలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అప్రమత్తం చేశారు.
తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
తుపాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందని తెలిపారు.
తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.