MLA Paritala Sunitha ఏడాదిన్నరలో ఎంతో అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే పరిటాల సునీత
ABN , Publish Date - Dec 11 , 2025 | 02:00 AM
ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని తూముచెర్లలో బుధవారం ఆమె పర్యటించారు.
కనగానపల్లి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని తూముచెర్లలో బుధవారం ఆమె పర్యటించారు.
ఈ సందర్భం గా అక్కడి చెత్తతో సంపద తయారీ కేం ద్రాన్ని పరిశీలించారు. అలాగే పేదలకు ఇంటిపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా గ్రామంలో 24గంటల విద్యుత 3ఫేస్ వ్యవస్థను ప్రారంభించారు. చెన్నమనాయని కోట నుంచి తూముచె ర్ల మీదుగా తగరకుంట వరకూ జరుగుతున్న బీటీరోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రహదారులకు మోక్షం లభించిందన్నారు. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత వైసీపీ పాలనలో గుంతల రోడ్లకు కనీసం ప్యాచ వర్క్ కూడా చేయలేదని విమర్శించారు. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే నాయకులం తాము కాదని, నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులు చేపట్టేవాళ్లమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్ర సాద్, ఎంపీడీఓ అనిల్‌కుమార్, మార్కెట్‌యార్డ్ చైర్మన బోయపాటి సుధాకర్‌చౌదరి, టీడీపీ మండల కన్వీనర్ యాతం పోతలయ్య, డీసీఎంఎస్ చైర్మన నెట్టెం వెంకటేష్, సర్పంచ మాధవరాజు, నాయకులు జయశంకర్ ఆదెప్ప, రామంజి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..