Home » Raptadu
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే లేపాయి.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
‘మా ప్రాణం మీరే.. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తామ’ని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కక్కలపల్లి క్రాస్‌లో గల ఆర్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం టీడీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది.
మండలకేంద్రంలోని ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై మరో 20 రోజుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడించారు. ఆ బ్రిడ్జి పనులను ఆమె నేషనల్‌హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.
మండలపరిషత అధ్యక్షురాలు హేమలతపై వైసీపీ ఎంపీటీసీ సభ్యుల అసమ్మతి తారాస్థాయికి చేరింది. దీంతో మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రెండో రోజు నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశానికి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
మండలంలోని ఆలమూరు చెరువు రెండురోజుల కిందట మరువ పారింది. దీంతో ఆ చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సాయంత్రం పరిశీలించారు.
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.