MLA: అంగనవాడీలపై కేసులు పెట్టించిన ఘనత వైసీపీదే
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:13 AM
చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ వారి బాగోగులను చూసుకునే అంగనవాడీ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించిన ఘనత వైసీపీదేనని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు.
రామగిరి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తూ వారి బాగోగులను చూసుకునే అంగనవాడీ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించిన ఘనత వైసీపీదేనని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వ ర్యంలో అంగనవాడీలకు సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని రామగిరి, కనగానపల్లి చెన్నేకొత్తపల్లి మండలాల్లోని 171 మంది అంగనవాడీల వర్కర్లకు 5జీ సెల్‌ఫోన్లను పంపిణీ చేశా రు.
అలాగే 18 మంది మినీ అంగనవాడీ కార్యకర్తలకు పదోన్నతుల సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్లు అందిస్తోందన్నారు. అంగనవాడీలు ప్రతి రోజూ అందించే పోషక ఆహారాలకు సంబంధించిన సమాచారాన్ని సెల్‌ఫోన్లలో నమోదు చేయాలని సూచించారు. గతంలో తాను స్ర్తీశిశుసంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అం గనవాడీలకు అండగా ఉన్నామని గుర్తు చేశారు. అదే వైసీపీ ప్రభుత్వం అంగనవాడీలను చాలా ఇబ్బందులు పెట్టిందని, వేతనాల కోసం ఉద్యమాలు చేస్తే కేసులు కూడా పెట్టించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ కవితాదేవి, సూపర్‌వైజర్లు లతాకిరణ్, ప్రశాంతి, ఎంపీడీఓ గంగావతి, ఎంఈఓలు సూర్యప్రకాశ, శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రవీణ్‌బాబు, ఎంపీపీ సాయిలీల, నాయకులు రామ్మూర్తినాయుడు, సుధాకర, సీకేపల్లి ముత్యాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..