Home » 2025
లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత నసనకోట దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్ల లో పాల్గొని శ్రమదానం చేశారు. నసనకోటలో వెలసిన దుర్గమ్మ ఉత్సవా లను చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.
ఉగ్రవాదం నశించాలి... హిందూ ముస్లిం బాయి.. బాయి అంటూ.... పహల్గాంలో ఉగ్రవాదుల దా డిని నిరసిస్తూ మాజీసైనికులు శనివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.
బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు, విరాట్ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది
చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఓడిన జట్టుకు నాకౌట్ అవకాశాలు తగ్గిపోతాయి. చెన్నై జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో కూడా ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు, సన్‌రైజర్స్ కూడా టాపార్డర్‌లో బలహీనత చూపిస్తున్నారు
ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌కు దూరమవ్వడంపై హర్షా భోగ్లే స్పందించాడు. రోస్టర్ ప్రకారం కామెంట్రీ చేయలేదని, తాను పక్కనపెట్టబడ్డానన్న వార్తలు నిజమవని స్పష్టం చేశాడు
ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన సవరణ చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఆందోలన చేపట్టారు. నిరసనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కొనసాగించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన బిల్లులు జమ కాకపోవడంతో పనిచేసే కూలీల ఖాతాల్లోకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కూలీకి దాదాపు పన్నెండు వారాలకు పైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. బిల్లులు సకాలంలో జమకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ ప్రైడే రోజు సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులకు గుడ్న్యూ అందిం చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ప్రైడే సందర్భంగా అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్, పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.