CITIU: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:48 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేసేందుకు కార్యాచ రణ రూపొందిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జి. ఓబులు పేర్కొన్నారు. ఆయన శనివారం ఓబులదేవరచెరువులో సీఊటీయూ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేసేందుకు కార్యాచ రణ రూపొందిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జి. ఓబులు పేర్కొన్నారు. ఆయన శనివారం ఓబులదేవరచెరువులో సీఊటీయూ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్రప్రభుత్వం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల అసంఘ టిత కార్మికులకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. అదేవిధంగా వామప క్షాల మద్దతుతో... గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్ర వేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ హక్కు చట్టాన్ని ఈ ప్ర భుత్వం కాలరాస్తోందన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టానికి నిధుల మంజూరు బాధ్యతను సగానికి పైగా తగ్గించి రాషా్ట్రలను భరించాలని చెప్పడంతో భవిష్యత్తులో వంద రోజులు పనులు కల్పించే పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, కర్షక విధానాలపై ప్రజల్లో చైతన్యం నింపేం దుకు కళాజాతాలు నిర్వహించి, ఉద్యమాలు చేపట్టేంందుకు ఫిబ్రవరిలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖప ట్నంలో అఖిల భారత సీఐటీయూ మహాసభలు నిర్వహి స్తున్న ట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యంలో యయతరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పి లుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి సున్నంపల్లి రమణ, సీపీం మండల కార్యదర్శి కుళ్ళాయప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....