Share News

DEVOLOPMENT: సీఆర్‌ఎస్‌ నిధులతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:39 PM

ప్రజా ప్రయోజనాల దృ ష్ట్యా, ప్రజల కోరిక మేరకు నంబులపూలకుంట తది తర సమీప పంచాయతీ లో సీఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. సీఎస్‌ఆర్‌ నిధులు రూ. కోటితో మండలకేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. మండకేంద్రమైన ఎన్పీ కుంట, పి. కొత్తపల్లి రెవెన్యూ గ్రా మాల్లో సోలార్‌ అల్ర్టా పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

DEVOLOPMENT: సీఆర్‌ఎస్‌ నిధులతో అభివృద్ధి పనులు
Ayyappaswamy temple under construction

నంబులపూలకుంట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనాల దృ ష్ట్యా, ప్రజల కోరిక మేరకు నంబులపూలకుంట తది తర సమీప పంచాయతీ లో సీఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. సీఎస్‌ఆర్‌ నిధులు రూ. కోటితో మండలకేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. మండకేంద్రమైన ఎన్పీ కుంట, పి. కొత్తపల్లి రెవెన్యూ గ్రా మాల్లో సోలార్‌ అల్ర్టా పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6,300 ఎకరాల్లో సోలార్‌ ప్లాంటు ద్వారా విద్యుత ఉత్పత్తి జరుగుతోంది. ఆ ప్రాజెక్టు ద్వారా మంజూరుచేసిన సీఎస్‌ఆర్‌ నిధులతో మండలకేంద్రంలో ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఇందలో అయ్య ప్ప స్వామి ఆలయానికి రూ.18లక్షలు, వైకుంఠ నారాయణస్వామి ఆలయాని కి రూ.25లక్షలు, శివాలయానికి రూ.37లక్షలు, చౌడేశ్వరీ కమ్యూనిటీ హాల్‌కు రూ.30లక్షలు నిధులు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రూ.20లక్షలు వెచ్చించి పడమర నడింపల్లిలో రామాలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రజాభిప్రాయం సేకరించి, ప్రజల విజ్ఞప్తి మేరకే సోలార్‌ ప్రాజెక్ట్‌ అధికారులు మండలకేంద్రంలో ఆలయాల నిర్మాణానికి రూ. కోటికిపైగా నిధులు మంజూరు చేశారు. కలెక్టర్‌నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సముఖత వ్యక్తం చేయడంతో సిఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన ఆలయాల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్పీకుంట పంచాయతీలోని అన్ని గ్రామాలకు రూ.3కోట్లు, పి.కొత్తపల్లి పంచాయతీలో రూ.3కోట్లు ఖర్చు చేసి సీసీరోడ్లు వేశారు. అలాగే ఆర్వో ప్లాంట్ల నిర్మాణం పూర్తి అయి,


ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. ఇక ఆలయాల నిర్మాణం పూర్తి అయితే గ్రామాల రూపురేఖలు మారుతాయని గ్రామస్థుల అభిప్రాయం. గ్రామానికి సమీపంలో ఎతైన కొండపైన ఆలయాల నిర్మాణం చేప ట్టారు. ఇదిలాఉండగా మల్లికార్జున స్వామి ఆలయానికి నిధులు మం జూరైనా, స్థల సమస్య వల్ల పనులు ప్రారంభం కాలేదని ప్రజలంటున్నా రు. అయితే స్థల వివాదం పరిష్కారమైందని, త్వరలోనే పనులు చేపడు తామని కాంట్రాక్టర్లు అంటున్నారు. అలాగే గ్రామంలో శివాలయానికి వెళ్లేందుకు సీసీరోడ్డు వేశారు. ప్రహరీ, వంటగదులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అయ్యప్పస్వామి ఆలయం గర్భగుడితో పాటు ఆవరణం పను లు పూర్తి అయ్యాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయ నిర్మాణం గోడల వరకు పూర్తికాగా, చౌడేశ్వరీ కమ్యూనిటీ హాల్‌ సిమెంటు పనులు పూర్తి అయ్యాయి. రెండు, మూడు నెలలో వాటి నిర్మాణం పూర్తి అవుతుందని, తరువాత ప్రారంభిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 28 , 2025 | 11:39 PM