Home » Kadiri
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో నూతన అధ్యాయానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బీజేపీ నియోజకవర్గ ఇనఛార్జ్ హారీష్‌బాబు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ పారదర్శకంగా, వేగంగా, సమయబద్ధంగా మార్చడంలో డీడీఓ కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్ శర్మ హాజరయ్యారు.
పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఏపీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రగతి మండల పరస్పర సహాయ సహకార సంఘం 28వ వార్షిక మహాసభలను మంగళ వారం ఘనంగా నిర్వహించారు. మండల సమాఖ్య వార్షిక మహాసభ కార్యక్రమంలో భాగంగా 2024-25 నివేదిక, లావాదేవీల ఆడిట్, చేపట్టిన పనుల వివరాలు వివరించారు.
మండల పరిఽధిలోని కటారుక్రాస్‌లోని రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ, వ్యవసాయ శాఖ ఏడీ సనావుల్లా ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాయలసీమలోని మెట్ట ప్రాంతం పండ్ల మొ క్కల సాగు అనుకూలమని రెడ్స్ సంస్థ రైతులకు ఉచితంగా అంది స్తోందని తెలిపారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి మీ ఇంటివద్దకే వచ్చామని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గోవిం దురాజులపల్లిలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన ప్రతి ఇంటివద్దకు వెళ్లి పింఛనదారుల యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందించారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ వరప్ర సాద్ కదిరి పట్టణంలోని వాహనాల యజమానులకు, డ్రైవర్లకు రహదా రి భద్రత నిబంధనలపై అవగాహన క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐపై మాట్లాడుతూ... రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.
మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్‌లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామ సచివాలయం.