Share News

MLA: లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:09 AM

ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.

MLA: లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు
MLA inspecting the arrangements at Thimmamma Marrimanu

- తిమ్మమాంబ ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కందికుంట

నంబులపూలకుంట, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు. మహాశిరాత్రి సందర్భంగా మూడురోజులపాటు తిమ్మమాంబ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 14, 15, 16న గతంలో లాగానే రథోత్సవం, కథం, మొక్కులు తీర్చుకోవడం వంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.


సద్గురు ఈషా ఫౌండేషన ఆధ్వర్యంలో 15న సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. మర్రిమాను ప్రాంతాన్ని పరిశీలించి, సౌకర్యాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల కన్వీన శ్రీరాములనాయుడు, సింగల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయుడు తదితరులున్నారు.

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన

గాండ్లపెంట: మండల పరిధిలోని కదిరి- రాయచోటి ప్రధాన రహదారి నుంచి వద్దిరెడ్డిపల్లికి వేస్తున్న నూతన రోడ్డును ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గురువారం పరిశీలించారు. ప్రధాన రహదారి గుండా వద్దిరెడ్డిపల్లికి వెళ్లే రోడ్డుకు రూ. కోటి తో తారు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం కోసం మట్టి వేశారు. ఇక్కడ తారురోడ్డు వేస్తే పలు గ్రామాల ప్రజలకు అనుకూలం. అయితే రోడ్డు నిర్మాణంపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం తో ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సమస్యను పరిష్కరించి, భవిష్యత్తులో భోగాదమ్మ ఆలయానికి కూడా రోడ్డు వేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, వైస్‌ సర్పంచ లక్ష్మీనరసా రెడ్డి, మాజీ సర్పంచ కాకర్ల రవీందర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 06 , 2026 | 12:09 AM