Share News

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:20 AM

మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన
RDO VVS Sharma participated in the Gram Sabha

గాండ్లపెంట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు. ఈ రీసర్వేపై రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకంలో వివరాలు తెలియజేసిర, రైతుల ఆమోదం పొందిన తరువాత తప్పులు లేకుండా రాజముద్ర కలిగిన పాస్‌ పుస్తకాలు అందించేందుకు ఈ గ్రామ సభ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బాబూరావు, మండల సర్వేయర్‌ చందన, వీఆర్‌ఓలు చంద్రశేఖర్‌, రామ్మోహన, క్రిష్టప్ప, రైతులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 05 , 2026 | 12:20 AM