APTF: పీఆర్‌సీని వెంటనే నియమించాలి : ఏపీటీఎఫ్
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:59 PM
పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయన్న డిమాండ్ చేశారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్ జోనల్ సమా వేశం నిర్వహించారు.
కదిరి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయన్న డిమాండ్ చేశారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్ జోనల్ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ... ప్రభు త్వం వెంటనే పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని, వెంటనే 30 శాతం తగ్గకుండా ఐఆర్‌ను ప్రకటించాలని, ఉపాధ్యాయుల ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు నారాయణ, రమణరెడ్డి, శ్రీవాణీ, మర్రి రామ్మోహన, మహబూబ్ బాషా, రామాంజినేయులు, రామ్ కుమార్, రమేష్‌కుమార్, సంపత, షబ్బీర్, అహ్మద్, బాబావలీ, షమీం, విజయనిర్మల, నరసమ్మ, నసీబ్ జాన, నాగరత్న, రత్నబాయ్, రూజినా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....