Dy CEO: కుటుంబ సర్వేని వేగవంతం చేయాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:08 AM
మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.
- జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య
గాండ్లపెంట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు. మండల వ్యాప్తంగా 8700 కుటుంబాలు ఉన్నాయనీ, ఇప్పటి వరకు 3000 వరకు మాత్రమే సర్వే నిర్వహించారన్నారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సర్వేలో ఎంపీడీఓ రామకృష్ణ, సచివాలయ ఉద్యోగులు ఊర్మిళ, పద్మజ, ఇలియాజ్ పలువురు పాల్గొన్నారు.
కదిరి అర్బన: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(యూఎఫ్‌ఎస్)లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎంపీడీవో పోలప్ప శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవాంతరాలు లేకుండా అందుతాయని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....