Share News

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:52 PM

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ
Devotees circumambulating Giri

కదిరి అర్బన, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు. స్తోత్రాద్రి కొండపై కొండల లక్ష్మీనరసింహుడిగా, కాటమ రాయుడిగా, చెంచులక్ష్మీ సమేతంగా కొలువైన శ్రీవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఖాద్రీ లక్ష్మీనరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2026 | 10:52 PM