GOD: భక్తులతో కిటకిటలాడిన తిమ్మమ్మ మర్రిమాను
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:08 AM
మహాశివ రాత్రిని పురస్కరించుకుని మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతం రెండోరోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడారు. ఈషా పౌండేషన ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంగా ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తిమ్మమాంబ బుర్రకథ వినిపిం చారు.
నంబులపూలకుంట, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మహాశివ రాత్రిని పురస్కరించుకుని మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతం రెండోరోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడారు. ఈషా పౌండేషన ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంగా ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తిమ్మమాంబ బుర్రకథ వినిపిం చారు. ఆది శివుడుని వేదికపై కొలువుదీర్చారు. ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థ సారఽథి హాజరయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఆలయ అర్చ కులు స్వాగతం పలికారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించి, ఆది శివుడు కొలువుదీరిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రసిద్ధ ఆలయాలున్న కదిరి ప్రాం తాన్ని టూరిజం సర్క్యూట్‌గా తీర్చిద్దిడానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఉత్సాహంగా కృషి చేస్తున్నారన్నారు. తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.
ఇటీవల పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంత్యు త్సవాల సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. భవిష్యతలో ఈప్రాంతం చాల అభి వృద్ధి జరగాల్సి ఉందన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ఎంపీ రూ. కోటి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ ఈప్రాంతానికి ఎంతో రుణపడి ఉన్నాను. 2026లోనే రూ. 5కోట్లతో కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు. అనంతరం ఆదిశివుడి సమీపంలో ఎంపీని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దుశ్శాలువతో సన్మానించారు. అనంతరం ఆదిశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిశివుడిని పల్లకిలోఊరేగించారు. భక్తులకు రుద్రాక్షలు, విబూది పంపిణీ చేశారు. అన ంతరం రుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్నదానం, నీరు, వైద్యం, వసతి తదితర సౌకర్యాలు కల్పించారు. తిమ్మమ్మమర్రిమాను ప్రాంతంలో ఆదివారం శివరాత్రి జాగరణ సందర్భంగా పట్టిష్ట భద్రతను పోలీసులు నిర్వహించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లద్వారా ఆలయ పరిసరా ప్రాంతాలు, పార్కింగ్‌స్థలాలు, ప్రధాన రహదారులు, భక్తుల రద్దీగా ఉన్న ప్రాంతాలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....