BUiLDING: శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:44 PM
స్థానిక విద్యుత శాఖ సబ్ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక విద్యుత శాఖ సబ్ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి. ఈ కార్యాలయం చుట్టూ ఉన్న సనసైడ్ కూడా పెచ్చులు ఊ డి నేడో రేపో కూలేలా ఉంది. విద్యుత బిల్లులు చెల్లించే వినియోగదా రులు భయం భయంగా సనసైడ్ చూ స్తూ బిల్లులు చెల్లిస్తున్నారు. వర్షాకాలం అయితే మరింత భయంగా వెళ్లా ల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. తేమకు పైకప్పు తడిసి ఎక్కడ ఊడి పడుతుందో అన్న భయం అందరిలో నెలకొంది. విద్యుత సబ్‌స్టేషన ఆవరణంలో సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లూ అలాగే ఉండ డంతో సిబ్బంది అద్దె ఇళ్లలో నివాసముం టున్నా రు. అదేవిధంగా ఓబుళదేవర చెరువు 1, 2 గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో పాత ఎస్సీ హాస్టల్లోని గదుల్లో సిబ్బంది విధు లు నిర్వహిస్తున్నారు. గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి పడు తున్నాయి. గోడలు దెబ్బతిన్నాయి.
అయినా తప్పని సరి పరిస్థితు ల్లో సిబ్బంది ఆ గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల కు సంబంధించి కొత్త భవనాలు నిర్మించేందుకు పాలకులు, అఽధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మండలపరిధిలో మరిన్ని...
మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం - 1, 2, విద్యుత శాఖ కార్యాలయంతో పాటు మండలపరిధిలోని నల్లగుట్లపల్లి పంచాయతీ కేం ద్రంలో సచివాలయం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంచాయ తీ భవనంలోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి తు మ్మల కుంట్లపల్లి, సున్నంపల్లి, ఇనగలూరు, మిట్టపల్లి తదితర గ్రామాల్లో నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాలను పూర్తి చేయడంతో పాటు మండలకేంద్రంలోని విద్యుత కార్యాలయా నికి మరమ్మతులుగానీ, నూతన భవన నిర్మాణం గానీ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని గ్రామ పంఛాయతీల్లో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో టన్నుల కొద్ది సిమెంట్ దోచేశారన్న ఆరోపణలు కూడా బహిరంగంగా వ్యక్తమతున్నాయి. వీటిపై కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....