Share News

MLA: గాండ్లపెంటకు త్వరలో కృష్ణా జలాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:39 PM

గాండ్లపెంట మంలలానికి త్వరలో కృష్ణా జలాలు వస్తాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన శని వారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేక రులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా జలాలు తెచ్చేందుకు ప్రభుత్వం జేఓ జారీ చేసిందని, ఎస్‌ఈ శనివారం పర్యటించారని తెలిపారు.

MLA: గాండ్లపెంటకు త్వరలో కృష్ణా జలాలు
MLA Kandikunta speaking at the press conference

ఎమ్మెల్యే కందికుంట

కదిరి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): గాండ్లపెంట మంలలానికి త్వరలో కృష్ణా జలాలు వస్తాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన శని వారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేక రులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా జలాలు తెచ్చేందుకు ప్రభుత్వం జేఓ జారీ చేసిందని, ఎస్‌ఈ శనివారం పర్యటించారని తెలిపారు. జనవరి మొదటి వారంలో టెండర్‌ ప్రక్రియ ప్రారంభ మవు తుందని, హంద్రీనీవా జలాలు గాండ్లపెంటకు వస్తే నియోజకవర్గంలోని అన్ని మం డలాలకు అందుతాయన్నారు. గొలుసుకట్టు విధానం ద్వారా అన్ని చెరువులు నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ధ్యే యమన్నారు.


అదేవిధంగా వేమన ఉత్సవాలను కటారుపల్లిలోనే అధికా రికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలి పారు. జనవరి 21న ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుం దన్నారు. రెండు రోజుల ముందే పాడుతా తీయగా గాయకులతో ప్రత్యేక కచేరీ నిర్వహిస్తామన్నారు. కాగా నాలుగు రోజుల కిందట పోలీసులకు వాహనాలు సమకూ ర్చటంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదుట వాటికి సర్వమ త ప్రార్థనలు చేయించామన్నారు. అయితే కొంత మంది సోషల్‌ మీడియాలో తప్పు పట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అన్యమత ప్రచారం చేయలేదని, ఎవరి మనసులైనా ఇబ్బంది పడి ఉంటే భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మోపూరి శెట్టి చంద్రశేఖర్‌, డైమెండ్‌ ఇర్ఫాన, రాజశేఖర్‌బాబు, కొలిమి జిలాన, కొయ్య రాజేంద్రనాయుడు తదిత రులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 27 , 2025 | 11:39 PM