MUSLIM: ముగిసిన ఇజితిమా
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:56 PM
మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన ఇజితిమా ఆది వారంతో ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముస్లింలు వే లాదిగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మత పెద్దలు ఖురాన సారాంశాన్ని వివరించారు.
కదిరి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన ఇజితిమా ఆది వారంతో ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముస్లింలు వే లాదిగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మత పెద్దలు ఖురాన సారాంశాన్ని వివరించారు. సమాజంలో మానవుల ప్రవర్తన, తోటివారిపట్ల మెలిగే విధానం తదితర అంశాలపై బోధించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఇజితిమాకు వచ్చే ముస్లింల కోసం ఎమ్మెల్యే ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇజితమాకు హాజరైన వారికి రెండురోజుల పాటు భోజనాలు, వసతులు కల్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....