SCHOOLS: ఆటస్థలాలు లేక... సత్తా చాట లేక..?
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:33 PM
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులు క్రీ డల్లోనూ రాణించాలని అన్నిరకాల ఆటలకు సంబంధించి క్రీడా సామగ్రి అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకోసం రోజూ ఒక గంట సమయం కేటాయిస్తారు.
నిరాశ వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
క్రీడా మైదానం లేని మండలంలోని పాఠశాలు
అమడగూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులు క్రీ డల్లోనూ రాణించాలని అన్నిరకాల ఆటలకు సంబంధించి క్రీడా సామగ్రి అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకోసం రోజూ ఒక గంట సమయం కేటాయిస్తారు. అయితే మండలపరిధిలోని జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆడుకోవడానికి స్థలం లేక విద్యార్థులు ఇబ్బంది పడు తున్నా రు. మండలంలో ఆరు జిల్లాపరిషత పాఠశాలలు, ఒక మోడల్ స్కూల్, ఒక కేజీబీవీ ఉన్నాయి. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు, మోడల్ స్కూల్‌లో ఇంటర్ విద్యార్థులతో కలిసి మొత్తం 1,670మంది విద్యార్థులు ఉన్నారు. మండలకేంద్రంలో ఉన్న జడ్పీ ఉన్న త పాఠశాలలో కబడ్డీ, ఖోఖో వాలీబాల్, షాట్‌పుట్ లాంటి క్రీడలకు మాత్రమే స్థలముంది. మండలస్థాయిలో క్రికెట్ పోటీలు పెట్టాలంటే ఎ క్కడికెళ్లాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు.
మండలంలో చాలామంది విద్యార్థినులు క్రికెట్ అంటే ఆసక్తి చూపుతున్నారు. కానీ సా ధనకు మైదాన లేక బాలికలు క్రికెట్‌కు దూరమవుతున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రానించాలని, క్రీడలతో మానసికి వికాసం కలుగుతుంది. క్రీడల్లో రాణించినవారికి ఉజ్వల భవిష్యత ఉం టుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉపన్యాసాలు విస్తున్నారే కానీ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు గురించి పట్టంచు కోవడం లేదనే విమర్శ లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా మైదానం లేకపోవడంతో తమ ప్రతిభ చాటలేకపోతు న్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు తమ సొంత గ్రామా ల్లో అరకొర వసతులు ఉన్న క్రీడామైదనాల్లో సాధన చేసి, మండల, డివిజన, జిల్లా స్థాయి క్రీడల్లో పోటీ పడుతున్నారు. పాఠశాలల్లో తగు సౌకర్యాలతో క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటుతామని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించి, క్రీడామైదానాలు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేనిది వాస్తవమే
- జిలాన బాషా, ఎంఈఓ, అమడగూరు మండలం
మండల వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఉన్న పాఠశాలు ఉన్నాయి. ఎందులోనూ క్రీడామైదానం లేనిది వాస్తవమే. మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో మాత్రం చిన్నచిన్న క్రీడలకు స్థలముంది. క్రికెట్ ఆడడానికి ఏ పాఠశాలోనూ మైదానం లేదు. మండలస్థాయిలో పోటీలు పెట్టాలంటే జూనియర్ కళాశాల మైదానానికి వెళ్లాల్సి ఉంది. కాకపోతే ఈ విషయంపై ఉన్నతాఽధికారులకు నివేదికలు పంపి, మైదానాల ఏర్పాటుకు కృషిచేస్తా.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....