WATER: మండలకేంద్రానికి చేరిన కృష్ణాజలాలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:53 PM
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు శనివారం మం డలకేంద్రానికి చేరాయి. దీంతో రై తులు ఎంతో ఆనందంగా ఉన్నా రు. మండలపరిధిలోని వంకమద్ది చెరువు నిండి మరవ ప్రవహిం చడంతో, మండల కేంద్రానికి నీరు మళ్లించారు. మండల కేం ద్రానికి అనుకుని హంద్రీనీకాలువ లో వెళ్తున్న కృష్ణాజలాలను చూ డడానికి ప్రజలు తరలి వెళ్తున్నా రు.
నంబులపూలకుంట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు శనివారం మం డలకేంద్రానికి చేరాయి. దీంతో రై తులు ఎంతో ఆనందంగా ఉన్నా రు. మండలపరిధిలోని వంకమద్ది చెరువు నిండి మరవ ప్రవహిం చడంతో, మండల కేంద్రానికి నీరు మళ్లించారు. మండల కేం ద్రానికి అనుకుని హంద్రీనీకాలువ లో వెళ్తున్న కృష్ణాజలాలను చూ డడానికి ప్రజలు తరలి వెళ్తున్నా రు. ప్రజల కోరిక మేరకు పెద్ద చెరువును నీటితో నింపేందుకు హంద్రీనీవా అధికారులు రైతులతో చర్చించి, పరిశీలించారు. గెలికివారి పల్లి సమీపంలో కాలువను చెరువులోకి మళ్లించడానిక అనుకూలంగా ఉందని, పెద్ద చెరువు నిండిన తరువాత దేవరచెరువును కూడా నీటితో నింపుతామని ఏఈ మనోహర్ పేర్కొన్నారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు దండే రవి, శివయ్య, మౌలా, నరసింహారెడ్డి, రాహూల్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....