Share News

FORMER MINISTER: పేదలకు అండగా సీఎం : మాజీ మంత్రి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:56 PM

పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్‌అలుక్కాస్‌ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్‌ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.

FORMER MINISTER: పేదలకు అండగా సీఎం : మాజీ మంత్రి
Former Minister Palle distributing CMRF cheques

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్‌అలుక్కాస్‌ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్‌ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొత్తచెరువుకు చెందిన వెంకటేష్‌ కు రూ రూ 3,01342 చెక్కును, బుక్కపట్నం మండలం గూనిపలి ్లకి చెందిన రాంగోపాల్‌రెడ్డి బార్య సంగీతకు రూ 1,31,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రత్నప్పచౌదరి, సామకోటి ఆదినారాయణ, గంగాధరనాయుడు, గూడూరు ఓబు లేసు, సురేష్‌చౌదరి, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 27 , 2025 | 11:56 PM