MLA Parita Sunitha: త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు..
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:27 AM
త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ప్రారంభం అవుతాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
- భూములిచ్చిన రైతులకు పరిహారం కూడా: ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు(అనంతపురం): పేరూరు ప్రాజెక్టు కాలువ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Parita Sunitha) అన్నారు. గంగులకుంటలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఆమె హాజరయ్యారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.13.05 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్ తన బొమ్మ వేసుకునేందుకు చూపిన శ్రద్ధ భూసమస్యల పరిష్కారంపై చూపలేదని విమర్శించారు.
పేరూరు ప్రాజెక్టు విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు, జగన్ పత్రిక కథనాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు(Peruru) ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అదే ఏడాది పనులు ప్రారంభించామని, రైతుల నుంచి భూమి సేకరించామని అన్నారు. కొంతవరకూ రైతులకు పరిహారం కూడా ఇచ్చామన్నారు.

ఆ తర్వాత ఆరు నెలలకే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఇక్కడున్న తోపు ఏదో చేస్తామంటూ జగన్ రెడ్డితో మళ్లీ భూమిపూజ చేయించారని అన్నారు. ఉన్న రిజర్వాయర్లను రద్దు చేసి మరో రెండింటిని తీసుకొచ్చారని మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు పరిహారం త్వరలో ఇస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News