LIC Jeevan Utsav: ఎల్‌ఐసీ నుంచి జీవన్ ఉత్సవ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:22 AM
ఎల్‌ఐసీ సరికొత్త సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకొచ్చింది. ‘జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం’ పేరుతో ప్రారంభించిన ఈ పాలసీని సంస్థ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి...
సింగిల్ ప్రీమియం ప్లాన్
న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ సరికొత్త సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకొచ్చింది. ‘జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం’ పేరుతో ప్రారంభించిన ఈ పాలసీని సంస్థ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి మంగళవారం విడుదల చేశారు. 30 రోజుల నుంచి 65 ఏళ్ల వయసు వ్యక్తులు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద కనీసం 5లక్షలకు బీమా రక్షణ లభిస్తుంది. గరిష్ఠ పరిమితి లేదు. అయితే ఈ గరిష్ఠ పరిమితి తమ బోర్డు ఆమోదానికి లోబడి ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఈ పాలసీ ద్వారా ప్రతి రూ.1,000 బీమా హామీకి ఏటా రూ.40 చొప్పున హామీతో కూడిన అదనపు మొత్తం జమవుతుంది.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి