CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:51 PM
కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట (Karur Stampede) కేసులో నటుడు, రాజకీయవేత్త, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ (Vijay)కు సీబీఐ (CBI) సమన్లు పంపింది. ఈనెల 12న తమ ముందు హాజరుకావాలని కోరింది.
కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు తొలుత తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేసును ప్రత్యేక విచారణ బృందం (SIT)కి అప్పగించింది. శాంతి భద్రతలు.. రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, సిట్ సమర్థవంతంగా దర్యాప్తు జరుపుతుందని కోర్టు ముందు తమిళనాడు ప్రభుత్వం వాదించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును టీవీకే ఆశ్రయించింది.
కరూర్ తొక్కిసలాట ఘటన దేశాన్ని కుదిపేసిందని, దీనిపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ ఈ ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వడం దగ్గర నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు, పోలీసుల మోహరింపు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాలపై విచారణ జరిపింది. టీవీకే నేతలు, అధికారుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
ఇవి కూడా చదవండి..
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..
స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి