New Delhi: ఢిల్లీలో కాల్పుల మోత.. ఇద్దరు అరెస్ట్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:15 AM
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజామునే ద్వారకలోని ఆయా నగర్‌లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇద్దరు దుండగుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
న్యూఢిల్లీ, జనవరి 6: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజామునే ద్వారకలోని ఆయా నగర్‌లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇద్దరు దుండగుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. దాదాపు 69 రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు దుండగుల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. కాగా, నిందితులపై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
ఒక్క రోజు గ్యాప్‌లోనే..
ఇదిలాఉంటే ఆదివారం నాడు కూడా ఢిల్లీ పరిధిలోని ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. గుర్గావ్‌లో క్రైమ్ బ్రాంచ్ సెక్టార్ - 40, క్రైమ్ బ్రాంచ్ పున్హానా, మేవాత్ బృందాలు సంయుక్తంగా సోహ్నా-గుర్గావ్ రహదారిపై అంతర్రాష్ట్ర నేరస్థుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు కాల్పులకు తెగబడగా.. పోలీసులు సైతం తిరిగి కాల్పులు జరిపారు. చివరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై రూ. లక్ష రివార్డ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగి రోజు గడవక ముందే.. మరో ఎన్‌కౌంటర్ జరగడం కలకలం రేగింది.
Also Read:
అరెరే.. ఈ దొంగకు పెద్ద కష్టమే వచ్చిందిగా..!
అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి