Watch Video: అరెరే.. ఈ దొంగకు పెద్ద కష్టమే వచ్చిందిగా..!
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:31 PM
ఇంటికి తాళం వేసి.. నిర్మానుష్యంగా కనిపిస్తే చాలు.. దొంగలు చెలరేగిపోతారు. ఆ ఇంట్లోకి దూరి.. అందినకాడికి దోచుకుపోతుంటారు. తాజా ఓ దొంగ కూడా అదే పని చేయబోయాడు. దొంగతనం కూడా చేశాడు. కానీ, చివర్లోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటికి తాళం వేసి నిర్మానుష్యంగా కనిపిస్తే చాలు.. దొంగలు చెలరేగిపోతారు. ఆ ఇంట్లోకి దూరి అందినకాడికి దోచుకుపోతుంటారు. తాజా ఓ దొంగ కూడా అదే పని చేయబోయాడు. దొంగతనం కూడా చేశాడు. కానీ, చివర్లోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ దెబ్బకు ఎందుకొచ్చానురా దేవుడా అంటూ గిలగిల కొట్టుకున్నాడు దొంగ. ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ల రచ్చ రచ్చ చేస్తోంది. మరి ఇంతకీ ఈ చోరీ ఎక్కడ జరిగింది.. ఆ దొంగకు ఏమైంది.. వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం.. సికార్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఖాటు శ్యామ్ మందిరానికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా స్వామీజీ దర్శనానికి వెళ్లారు. దీనికి గమనించిన ఓ దొంగ.. ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని భావించాడు. ఇంటి లోపలికి ఉన్న మార్గాలన్నింటినీ పరిశీలించాడు. కిచెన్ రూమ్ వద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన రంధ్రాన్ని గమనించాడు. ఇంకేముంది.. అందులోంచి ఇంట్లోకి దూరాడు. ఇంట్లో ఉన్న విలువైన వాటిని చోరీ చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ ఎగ్జాట్స్ హోల్ నుంచే బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ హోల్‌లోనే దొంగ ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు.
ఇంతలో ఇంటి యజమానులు రానే వచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్‌లో ఇరుక్కుపోయిన దొంగను చూసి హడలిపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్‌లో ఇరుక్కుపోయిన దొంగను అతి కష్టం మీద బయటకు లాగారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.
దొంగ అతి తెలివితో చేసిన ఈ చోరీ ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి..
Also Read:
10వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయితే చాలు.. న్యూ ఇయర్ వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్..
అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి