Railway Jobs 2026: రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. టెన్త్ లేదా ఐటీఐ పాసయితే చాలు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:22 PM
న్యూ ఇయర్ వేళ ఆర్ఆర్‌బీ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 22 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే రీజియన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఆర్ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్ అండ్ టీ తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. 2026 జనవరి 21 నుంచి అర్హులు ఎవరైనా.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
వయో పరిమితి..
ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 20 రాత్రి 11:59 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పని సరిగా.. ఆధార్ వివరాలను నమోదు చేయాల్సి ఉందంటూ నిబంధన విధించింది. అంతేకాదు.. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీతో పాటు ఫొటో, 10వ తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలతో తప్పనిసరిగా సరిపోలాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఆధార్ పరిశీలనను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం నాటి నుంచి అభ్యర్థులు తమ ఆధార్ కార్డులోని వివరాలు, పదో తరగతి మార్క్‌లిస్ట్‌లోని వివరాలను సరిపోలి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాల్సి ఉంది.
ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18 వేల నుంచి బేసిక్ జీతంలోపాటు ఇతర అలవెన్సులు చెల్లించనుంది రైల్వే శాఖ. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే: బీజేపీ చీఫ్
Read Latest Educational News And Telugu News