Home » Education
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రధాన పరీక్షలకు ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ తప్పనిసరి కానుంది. నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్టీఏ సిద్ధమైనట్టు సమాచారం.
హైదరాబాద్ లోగల జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్షిప్లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.
చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎ్ఫఎల్ఎన్) కార్యక్రమాన్ని రూపొందించింది.
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్రావు, డీఈవో కేవీఎస్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్పో, ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలను జేఎన్టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.