JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:23 AM
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
- జేఎన్‌టీయూ ఆచార్యుల్లో అసహనం
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు. తాజాగా ఈ నెల 17నుంచి ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికీ ప్రమోషన్ లెటర్లు చేతికి అందకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. వాస్తవానికి జేఎన్‌టీయూ చేపట్టిన ఇంటర్వ్యూల ప్రక్రియ తుది నివేదికను పాలకమండలి (ఈసీ) ఆమోదించాల్సి ఉంది.

ఈ నెల 23న పాలకమండలిలో ఆమోదం లభిస్తుందని ఉన్నతాధికారులు భావించినప్పటికీ, ఈసీలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు పదోన్నతుల ప్రక్రియ జరిగిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే, 2016లో ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన కొందరు ఆచార్యులు తమను 2013 నుంచి ప్రొఫెసర్లుగా గుర్తించాలని కోరడంతో ఈ ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది.
వారి ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారం అసమగ్రంగా ఉండడంతో ఐఏఎస్‌లు.. వర్సిటీ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 30న మరోమారు పాలకమండలి సమావేశం నిర్వహించి, ఐఏఎస్ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News