Home » JNTU
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
జేఎన్టీయూ వన్టైమ్ చాన్స్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.
జియో స్పేషియల్ సైన్స్ రంగంలో జేఎన్టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఇంజనీరింగ్ విద్యలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జేఎన్టీయూహెచ్ కొత్త అకడమిక్ (ఆర్25) రెగ్యులేషన్స్ను రూపొందించింది.
Abdul Nazeer JNTU Kakinada: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ తరం ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్ జెనరేషన్) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్టీయూ సిలబస్ రూపుదిద్దుకుంటోంది.
జేఎన్టీయూలో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి.
జేఎన్టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.
జేఎన్టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్కుమార్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు.
పోస్టు గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.