Share News

JNTU: నాన్‌బోర్డర్స్‌పై జేఎన్‌టీయూ కొరడా..

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:32 AM

కూకట్‏పల్లిలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లో నాన్‌బోర్డర్స్‌పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్‌ ఖాళీ చేయకుంటే పీహెచ్‌డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.

JNTU: నాన్‌బోర్డర్స్‌పై జేఎన్‌టీయూ కొరడా..

  • క్వార్టర్స్‌ ఖాళీ చేయకుంటే పీహెచ్‌డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో అనధికారికంగా నివసిస్తున్న నాన్‌బోర్డర్స్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. కొందరు అభ్యర్థులు పీహెచ్‌డీ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా క్యాంపస్‏లో లోని క్వార్టర్స్‌ను ఖాళీ చేయకపోవడాన్ని యూనివర్సిటీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నెలాఖరులోగా క్వార్టర్స్‌ను వదిలి వెళ్లని పక్షంలో వారికి ఇప్పటికే ప్రదానం చేసిన పీహెచ్‌డీ డిగ్రీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ల ఆదేశాల మేరకు జేఎన్‌టీయూ ఎస్టేట్‌ ఆఫీసర్‌ నుంచి 8మంది (నాన్‌ బోర్డర్‌) అభ్యర్థులకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.


city7.2.jpg

మరోవైపు పీహెచ్‌డీ ప్రవేశాలు పొందిన అభ్యర్థుల నుంచి క్వార్టర్స్‌ కావాలని ఒత్తిడి పెరగడంతో అనధికారికంగా క్యాంప్‌సలో ఉంటున్న నాన్‌బోర్డర్స్‌ను బలవంతంగా (పోలీసుల సహకారంతో) నైనా ఖాళీ చేయించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వర్సిటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూనివర్సిటీ అధికారుల తాజా హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు నాన్‌బోర్డర్స్‌ కుటుంబాలు ఖాళీ చేశాయని, మరో ఐదుగురు నెలాఖరులోగా ఖాళీ చేస్తామని చెప్పినట్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్‌ టీచర్‌

మా ఊరికి రోడ్డు వేయరూ..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2025 | 10:32 AM