JNTU: జేఎన్‌టీయూలో గేట్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉచితం
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:06 AM
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు.
- బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) క్యాంపస్ కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు. ప్రముఖ శిక్షణా సంస్థ ఏస్ అకాడమీ సౌజన్యంతో ఈ ఉచిత శిక్షణను జేఎన్‌టీయూ విద్యార్థులకు అందిస్తోందని వర్సిటీలోని ఎస్సీఎస్టీ సెల్ సమన్వయకర్త క్రాంతికిరణ్(Kranthikiran) తెలిపారు.

ఏస్ అకాడమీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) కార్యక్రమాల్లో భాగంగా నిష్ణాతులైన ఆచార్యులతో గేట్ శిక్షణను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉచిత గేట్ శిక్షణను పొందాలనుకునే అభ్యర్థులు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని ఎస్సీఎస్టీసెల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News