TGSRTC: రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:26 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఇతర ప్రాంతాలకు టికెట్ బుక్ చేసుకునే సమయంలో తిరుగు ప్రయాణ టికెట్ కూడా బుక్ చేసుకుంటే 10శాతం రాయితీ ప్రకటించింది. ప్రయాణికుల్ని ఆర్టీసీవైపు ఆకర్షించేందుకు ఇప్పటికే పలు మార్గాల్లో టికెట్ ధరలు, ఈవీ బస్సుల్లో రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండగవేళ తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేసుకుంటే రాయితీ అందుబాటులోకి తెచ్చింది.