Home » Education News
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‌గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత కోచింగ్, ఉచిత వసతి కల్పిస్తున్నట్టు వెల్లడించింది. విద్యార్థులు డిసెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని, 7న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని.. 11న ఫలితాలు, 14 నుంచి తరగతులు..
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో వయో పరిమితి అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. 28 ఏళ్లు దాటితే హాస్టల్ లేదని అధికారులు పేర్కొనడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏఐ జమానాలో కంప్యూటర్ సైన్స్, ఐటీ డిగ్రీ పట్టాలు ఉన్న వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్టు తేల్చింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎంబీఏ కాస్త వెనుకబడగా కామర్స్ గణనీయంగా మెరుగైనట్టు కూడా నివేదికలో తేలింది.
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కౌన్సిలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను..
ఇలా కాలేజీలో చదువు పూర్తి కాగానే.. అలా ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేయ్యదు. మంచి ఉద్యోగం రావాలంటే.. మంచి కాలేజీలో చదవాలి. మంచి కాలేజీలో చదవాలంటే.. అందుకు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. అలా అయితేనే అత్యుత్తమ ర్యాంకు వస్తుంది.
ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.
జేఎన్‌టీయూలో బోధనేతర (నాన్‌టీచింగ్) పోస్టుల్లో సుమారు 40 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండడాన్ని జేఎన్‌టీయూహెచ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.