జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల విడుదల..
ABN , Publish Date - Feb 16 , 2026 | 07:07 PM
జేఈఈ మెయిన్ (JEE Main 2026) సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు..
ఇంటర్నెట్ డెస్క్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2026) సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ తొలి విడత (Paper 1 – B.E./B. Tech) రాసిన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేది ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. వీరిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వంద పర్సంటైల్ స్కోరు సాధించి ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్, తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహిశ్వరి 100 పర్సంటైల్ సాధించారు.
జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో Paper 1 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 13,55,293 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 13,04,653 మంది (సుమారు 96%) పరీక్షకు హాజరయ్యారు. Paper 2 ఫలితాలు, జూనియర్ / ఆర్కిటెక్చర్ విభాగాలు త్వరలో విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
For More Latest News