UGC NET Admit Cards: యూజీస్ నెట్ హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:13 AM
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు.. 2026 జనవరి 07న ముగియనున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎగ్జామ్ సంబంధిత పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(UGC NET) డిసెంబర్ 2025 హాల్ టికెట్లను విడుదల చేసింది. యూజీసీ నెట్ పరీక్షలు డిసెంబర్ 31 నుంచి ప్రారంభమవనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలు మీకోసం...
లాగిన్ అవడానికి ముందు.. యూజీసి సంబంధిత అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను అందుబాటులో ఉంచుకోండి.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశాక, యూజీసీ నెట్ హాల్ టికెట్ పీడీఎఫ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
అవసరమైన లాగిన్ వివరాలు అనగా అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
తర్వాత.. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2025 స్క్రీన్‌పై డౌన్లౌడ్ చేసుకునేందుకు రెడీగా ఉంటుంది.
హాల్ టికెట్‌ను పీడీఎఫ్‌లో సేవ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
మీరు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లో.. అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పుట్టిన తేదీ, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయాలు, పరీక్షా కేంద్రం చిరునామా, ఇతర వివరాలు ఉంటాయి. వాటన్నింటినీ ఒకసారి తనిఖీ చేసుకోండి. వాటిల్లో ఏదైనా పొరపాటు దొర్లినట్టయితే సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
సబ్జెక్టుల వారీగా యూజీసీ నెట్ షెడ్యూల్:
డిసెంబర్ 31: ఉదయం - తెలుగు, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, స్పానిష్, ప్రాకృతం, లా, సోషల్ వర్క్, కశ్మీరీ, కొంకణి
జనవరి 2: ఉదయం సెషన్ - కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఉర్దూ, ఫోరెన్సిక్ సైన్స్, బెంగాలీ, అరబిక్, బోడో, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్
మధ్యాహ్న సెషన్ - సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, ఒరియా, యోగా, పంజాబీ, సోషల్ మెడిసిన్ & కమ్యూనిటీ హెల్త్, మహిళా అధ్యయనాలు
జనవరి 3: మార్నింగ్ షిఫ్ట్- వాణిజ్యం, సంస్కృతం, సంతాలీ, క్రిమినాలజీ, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ/ప్రాంత అధ్యయనాలు, విపత్తు నిర్వహణ, మ్యూజియాలజీ - పరిరక్షణ.
మధ్యాహ్నం షిఫ్ట్ - భౌగోళిక శాస్త్రం, విద్య, జానపద సాహిత్యం, మైథిలీ, భారతీయ సంస్కృతి, పర్షియన్, మతాల తులనాత్మక అధ్యయనం
జనవరి 5: మార్నింగ్ షిఫ్ట్ - ఇంగ్లీష్, సంస్కృతం సాంప్రదాయ సబ్జెక్టులు, ఆంత్రోపాలజీ, వయోజన, నిరంతర విద్య, ఫ్రెంచ్, డోగ్రీ, రష్యన్, చైనీస్
మధ్యాహ్నం మార్పు - చరిత్ర, దృశ్య కళ, అస్సామీ, గిరిజన, ప్రాంతీయ భాషలు/సాహిత్యం, పురావస్తు శాస్త్రం, గుజరాతీ, రాజస్థానీ
జనవరి 6: మార్నింగ్ షిఫ్ట్ - పొలిటికల్ సైన్స్, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, హిందూ స్టడీస్, నేపాలీ, కంపారిటివ్ లిటరేచర్, జపనీస్, సింధీ
మధ్యాహ్నం షిఫ్ట్ - హిందీ, తమిళం, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, కన్నడ, మలయాళం, మణిపురి, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, జర్మన్
జనవరి 7: మార్నింగ్ షిఫ్ట్ - ఎకనామిక్స్, అనుబంధ సబ్జెక్టులు, మేనేజ్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జనాభా అధ్యయనాలు, భాషాశాస్త్రం, బౌద్ధ/జైన/గాంధీయన్, శాంతి అధ్యయనాలు, ఆయుర్వేద జీవశాస్త్రం, పాళీ
మధ్యాహ్నం షిఫ్ట్ - పర్యావరణ శాస్త్రాలు, గృహ శాస్త్రం, శారీరక విద్య, కార్మిక, సాంఘిక సంక్షేమం, ఎలక్ట్రానిక్ సైన్స్, సంగీతం, మరాఠీ, ప్రదర్శనా కళలు.
ఇవీ చదవండి:
కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?