Bike Accident: కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:57 AM
కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి, డిసెంబర్ 28: నారాయణ ఖేడ్ పట్టణ శివారులోని నిజాంపేట్ - బీదర్ జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి కల్వర్టు గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను కల్వర్టు గుంతలో నుంచి వెలికి తీశారు. మృతులు ఆవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్(23)గా గుర్తించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ నుంచి బైక్‌పై వారు శనివారం అర్థరాత్రి నర్సాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?
ఏడాదిలోనే ఏపీకి రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
For More TG News And Telugu News