Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:04 AM
పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అలాగే కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ.. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిందీ రైల్వే శాఖ.
హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్కాల్సిన రైలు మిస్సయిన వారికి శుభవార్త తెలిపింది. రైల్వే కరెంట్ బుకింగ్/ కరెంట్ అవైలబులిటీ సదుపాయాన్ని తీసుకొచ్చు వచ్చింది. రైలు బయలుదేరడానికి అరగంట మందు వరకు.. సీట్లు అందుబాటులో ఉంటే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంటే రైలు బయలుదేరే 4 గంటల ముందు నుంచి ప్రయాణికుల చార్ట్ తయారయ్యే వరకు అంటే.. రైలు బయలుదేరే 3 నిమిషాల ముందు వరకు) బుకింగ్ అందుబాటులో ఉంటుంది.
ఎలా బుక్ చేసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ టికెట్ తీసుకోవచ్చు. లేదా రైల్వే స్టేషన్లలోని కౌంటర్ల వద్ద అంటే.. కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకునే వీలు కల్పించింది.
ఎలా పరిశీలించాలంటే.. సీట్ అవైలబులిటీ చూస్తే కరెంట్ అవైలబుల్ అని కనిపిస్తే.. ఆ సీటు కరెంట్ బుకింగ్ కోసం అందుబాటులోఉన్నట్లు అర్థం. రెగ్యులర్ బుకింగ్‌లో తేదీ ఎంచుకొని చూడవచ్చు.
తత్కాల్ ఛార్జీలు ఉండవు.. సాధారణ టికెట్ ధర వర్తిస్తుంది. అన్ని క్లాస్‌లలో.. అంటే ఏసీ, స్లీపర్ కోచ్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అరకు ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు
ఏడాదిలోనే ఏపీకి రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
For More TG News And Telugu News