Share News

Goods Train Derailment: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన రాకపోకలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:03 AM

గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎనిమిది బోగిలు బ్రిడ్జ్ పైనుంచి కింద పడిపోయాయి. సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

Goods Train Derailment: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన రాకపోకలు

పాట్నా, డిసెంబర్ 28: బిహార్‌లో రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. వంతెన పైనుంచి 8 గూడ్స్ వ్యాగిన్లు కిందపడ్డాయి. శనివారం అర్ధరాత్రి లహాబాన్- సిముల్‌తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అసన్‌సోన్ నుంచి సీతామర్హీ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


అనంతరం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్.. యువకులు దుర్మరణం..

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కవలసిన రైలు మిస్సయ్యిందా..?

For More National News And Telugu News

Updated Date - Dec 28 , 2025 | 10:11 AM