Share News

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:48 AM

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్
AP Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు.. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సమాధాన మిచ్చారు. నాడు నేడు కింద పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణకు దీటుగా స్పందించారు లోకేశ్.


ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నాం..

సబ్జెక్టు మాట్లాడుతుంటే వైసీపీ వాళ్లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పాఠశాలల అభివృద్ధికి రూ.7500 కోట్లు వెచ్చించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద అభివృద్ది చేసిన 233 పాఠశాలలను మూసేసిందని ప్రస్తావించారు. పాఠశాలలను అభివృద్ధి చేసి అత్యుత్తమ విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించామని అన్నారు. 40 శాతం కన్నా తక్కువ ప్రభుత్వ పాఠశాలలు 2 స్టార్ రేటింగ్ కంటే తక్కువగా ఉన్నాయని వివరించారు. స్టార్ రేటింగ్‌లో వెనుకబడిన పాఠశాలలను రేటింగ్ పెంచేందుకు తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు.


లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై దృష్టి..

లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పనులకు బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో బకాయిపెట్టిన రూ.500 కోట్లు పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్న ఆయన.. 8వ తరగతి పిల్లలు కూడా 2వ తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నారని ఓ సర్వేలో తేలిందని చెప్పారు. సబ్జెక్టు వారీగా విద్యా ప్రమాణాలు పెంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడేలా తమ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 01:08 PM