Share News

BEL Job Notifications: బీఈఎల్‌ జాబ్ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:28 PM

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజనీర్‌లను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..

BEL Job Notifications: బీఈఎల్‌ జాబ్ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
BEL Job Notifications

న్యూఢిల్లీ, జనవరి 4: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అప్లికేషన్స్ మొదలవగా.. జనవరి 9, 2026 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ నియామక ప్రక్రియ కింద BEL వివిధ విభాగాలలో మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనుంది.


ట్రైనీ ఇంజనీర్-I కి ఎలక్ట్రానిక్స్‌లో 65 పోస్టులు ఉన్నాయి. వాటిలో జనరల్ కేటగిరీకి 30, OBC కి 20, EWS కి 4, SC కి 7, ST కి 4 రిజర్వ్ చేశారు. కంప్యూటర్ సైన్స్‌లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. వీటిలో EWS కి 3, ST కేటగిరీలకు 3. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 37 పోస్టులు ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 15, OBC కి 10, EWS కి 3, SC కి 6, ST కి 3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 8 పోస్టులు ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 4, OBC కి 2, EWS కి 1, SC కేటగిరీకి 1 పోస్ట్ రిజర్వ్ అయ్యాయి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్‌లో జనరల్ కేటగిరీకి 1 పోస్ట్ మాత్రమే రిజర్వ్ చేశారు. ట్రైనీ ఆఫీసర్-I (ఫైనాన్స్) లో 2 పోస్టులు ఉన్నాయి. వీటిలో SC కి 1, EWS అభ్యర్థులకు 1 పోర్ట్ రిజర్వ్ చేశారు.


ఈ జాబ్‌కు అప్లై చేసే అభ్యర్థులు రూ. 150 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ కూడా యాడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును SBI కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. SC, ST, PwBD కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


అర్హతలు..

అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ, విశ్వవిద్యాలయం, కాలేజీ నుండి సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల BE, B.Tech., B.Sc. ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్, EWS కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 28 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం బీఈఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.




Also Read:

Power Banks Barred by DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్‌లపై నిబంధనలు కఠినతరం.. కారణమిదే..

Health Tips: టీతో కలిపి ఇవి అస్సలు తినకండి.. లేదంటే..

Snowfall: జమ్ము కశ్మీర్‌‌పై మంచు దుప్పటి.. టూరిస్టులతో సందడిగా సోనమార్గ్ లోయ

Updated Date - Jan 04 , 2026 | 04:28 PM